Thursday, March 12, 2009

యు. ఎస్. L1 B వీసా ఇంటర్వ్యు - 26th Feb, 2009 - రెండో భాగం

ముందు మా దగ్గర ఉన్న ఇంటర్వ్యూ డాక్యుమెంట్స్ , తరువాత ఇతర సర్టిఫికేట్స్ అన్ని చూసి, గేటు నుండి లోపలికి వెళ్ళమని చెప్పారు. అక్కడ మరో ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు, మరో మారు తనిఖీ నిర్వహించి , అందరి వద్ద కవర్లు లేదా ఫైల్స్ లాంటివి ఉంటే అవి తెరచి చూస్తున్నారు. వీలైనంత వరకు ఓపెన్ గా ఉండే ఫైల్ ఫోల్డర్ తీసుకు వెళ్ళాటం మంచిది. అక్కడ నుండి లోపలికి వెళ్ళాక ఒక దగ్గర కూర్చోమన్నారు. తరువాత ప్రొద్దన ఉన్న ఇంటర్వ్యూ సమయాన్ని బట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగి ఆ క్రమ పద్దతిలో ఒక్కొక్కరిని అక్కడ ఉన్న నాలుగు కౌంటర్లలో ఒకదాని దగ్గరికి పంపిస్తున్నారు. అలా నేను వెళ్ళిన కౌంటర్లో నా ముందు ఒక ఇద్దరు ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందా? అని చూస్తూ ఉన్నాను, పది నిముషాల్లో నా వంతు వచ్చింది. నేను నా పాసు పోర్ట్, సర్టిఫికేట్స్, ఇతర డాక్కుమెంట్స్, వీసా డీడీ అన్నీ తీసి కౌంటర్లో ఉన్న అతనికి ఇచ్చాను. డీడీ ల వెనకాల నా పేరు , మొబైల్ నుంబరు రాసి ఇమ్మన్నాడు. రాసి ఇచ్చాను. అతను వాటిని పరిశీ లించి వాటిని మరో ఫోల్డర్ లో పెట్టి నాకు ఇచ్చాడు. ఆ తరువాత నా చేతి ముద్రల కొరకు అక్కడ ఉన్న ఒక యంత్రం పై ముందు నా కుడి చేతి నాలుగు వేళ్ళను (బొటన వేలు తప్ప) ఆ తరువాత నా ఎడమ చేతి నాలుగు వేళ్ళను ఆ తరువాత నా రెండు చేతుల బొటన వేళ్ళను పెట్టమని చెప్పి వేలి ముద్రలు తీసుకొని, పక్క న ఉన్న గేటు వైపుగా వెళ్ళమన్నాడు. నా పక్కన ఉన్న కౌంటర్లో సంతోష్ ది ఇంకా కాలేదు అతని ముందు ఉన్న ఒక భార్య భర్తల డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నాడు ఆ కౌంటర్లో అతను. సంతోష్ నన్ను ఉండ మని సైగ చేసాడు , నేను అక్కడే ఉన్న ఒక కుర్చీ లో రెండు నిముషాలు కూర్చున్నాను, ఐతే ఇంతకు ముందర నన్ను కౌంటర్ వద్దకు పంపిన ఆమె వచ్చి పక్క గేటు నుండి లోపలికి వెళ్ళమనే సరికి ఇంక నేను వెళ్ళాను.
అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసి వెళ్ళాను, అక్కడ కొంత మంది కుర్చీల్లో కూర్చొని ఉన్నారు, కొందరు కౌంటర్ల వద్ద నిలుచున్నారు, నేను వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. అలా పది నిముషాలయ్యింది, అప్పుడు సంతోష్ వచ్చాడు. ఈ లోగా ఉదయం తొమ్మిది పదిహేనుకు ఉన్న వాళ్ళు ఇటు రండి అంటూ ఒకతను ఆంగ్లంలో , తెలుగులో, హిందీలో, తమిళ్ లో అన్నాడు, మరొకతను వచ్చి కన్నడంలో , మళయాళంలో చెప్పాడు. మేము వెళ్ళి మరో కౌంటర్ వద్ద నిలుచున్నాము, అక్కడా యూ ఎస్ వీసా డీడీ తీసుకొని , దానికి రిసిప్ట్ ఇచ్చారు. అక్కడి నుండి మరి కొంత లోపలికి వెళ్ళాము. అక్కడ కూడా కొందరు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు, కొందరు కౌంటర్ల వద్ద నిలుచున్నారు.
అక్కడ ఆరు కౌంటర్లు ఉన్నాయి, మొదటి నాలుగు కౌంటర్లలో నలుగురు అమెరికన్లు ఉన్నారు. చివరి రెండు కౌంటర్లలో ఉన్న వాళ్ళు కనపడలేదు. ఐతే అవి రీజినల్ లాంగ్వేజస్ లో వీసా ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళ కోసము. మొదటి నాలుగు కౌంటర్ల లో ఒక్కొక్కరు ఇంటర్వ్యూ కి వెళ్ళారు. ఆ కౌంటర్ల లోకి వెళ్ళడనికి ముందు నిలుచున్న లైను గీతలాగ కాకుండా , పాములాగ వంకలుగా ఉంది. కాసేపటికి మమ్మల్ని కూడా లైనులో ఉండమని చెప్పారు. అప్పటికి తొమ్మిదిన్నర అయ్యింది సమయం. అక్కడి నుండి ఇంటర్వ్యూని కాస్త దగ్గరగా చూడొచ్చు. మూడో కౌంటర్లో ఉన్న అతనికి పిల్లి గడ్డం ఉంది. ఎందుకో అతన్ని చూడగానే ఎక్కువగా రెజెక్ట్ చేసే వాడిలా అనిపించింది నాకు. మేము అలా లైనులో ఉన్నప్పుడే కనీసం పదిహేను మంది ఇంటర్వ్యూలు పూర్తి అయ్యాయి. ముగ్గురివి రెజెక్ట్ అయ్యాయి. ఆ ముగ్గురు కూడా ఆ మూడో కౌంటర్ కి వెళ్ళిన వాళ్ళే. ఇంక మా వంతు వచ్చింది, సంతోస్ దగ్గరికి వచ్చే సరికి మూడో కౌంటర్ ఖాలీగా ఉంది, సంతోష్ ని అక్కడికి వెళ్ళమని చెప్పటంతో తను వెళ్ళాడు. అప్పటికి నాలుగు కౌంటర్లు ఫుల్లుగా ఉన్నయి, నన్ను ఒకటో కౌంటరు పక్కన ఉన్న వైపుగా వెళ్ళ మన్నారు. నేను అటుగా వెళ్ళాను , అటు వైపు మరో మూడు కౌంటర్లు ఉన్నాయి, నా ముందర ఒకతను ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆ కౌంటర్లో ఉన్నతన్ని చూశాను, చాలా కూల్ గానే కనిపించాడు. ఐనా ఇంటర్యూ కి వచ్చింది మనం కాబట్టి మనం కూల్ గా ఉండాలి. నాముందరతని ఇంటర్యు ఐపోయింది. నేను ముందుకు వెళ్ళాను. వీసా ఆఫీసర్ కి ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి మధ్య ఒక గాజు అద్దం ఉంది. అతన్ని చూసి చిరునవ్వుతో 'గుడ్ మార్నింగ్ సర్ ' అంటూ వీసా కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న ఫోల్డర్ ఇచ్చాను. బహుశా నా గొంతు చిన్నగా వినపడిందేమొ అతను కాస్త ఆలస్యంగా 'గుడ్ మార్నింగ్! హౌ ఆర్ యూ ' అంటూ నా ఫోల్డర్ అందుకున్నాడు. అప్పుడు గమనించాను నేను గాజు అద్దం ముందర ఒక చిన్న మైకు ఉంది. ఇంతకు ముందు నేను నా కాలర్ మీద ఉన్న మరక కనబడకుండా ఉండేందుకు కాస్త వెనకాల నిలుచుని మాట్లాడాను. ఇక ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళి రెండు చేతులను కౌంటర్ ముందుకు ఆనించి, ' ఐ యాం ఫైన్ సర్. హౌ అబౌట్ యూ ' అన్నాను. 'అయాం ఫైన్! థాంక్యూ' అంటూ తన దగ్గర ఉన్న కంప్యూటర్లో ఎదో ఫీడ్ చేసి ఇక నన్ను ప్రశ్నలడగటం మొదలెట్టాడు. మొదటి ప్రశ్న 'హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ విథ్ యువర్ కంపనీ ' (ఇక్కడ మా కంపనీ పేరు ప్రస్తావించటం లేదు) , దానికి సమాధనమిచ్చాక, రెండవ ప్రశ్నగా 'హూ ఈజ్ యువర్ క్లైంట్ ' అని అడిగాడు దానికి కూడా సమాధనమిచ్చాక, మూడవ ప్రశ్నగా 'వై డూ యూ థింక్ థట్ యూ కం అండార్ స్పెషలైజ్డ్ స్కిల్డ్ పర్సొనెల్ ' దానికి కూడా సమాధానమిచ్చాను. నేను సమాధానమిస్తున్నంత సేపు అతను నన్ను చూస్తూనే కంప్యూటర్లో ఎదో ఫీడ్ చేస్తున్నాడు. మూడో సమధానం తరువాత 'ఓ కే గెంటిల్ మాన్. వుయ్ విల్ సెండ్ యువర్ పాస్పోర్ట్ విధిన్ వన్ వీక్' అన్నాడు. 'థాంక్యూ సర్! హావ్ ఏ గ్రేట్ డే' అంటూ బయలుదేరాను, అతను 'యూ టూ' అన్నట్టు గా వినిపించింది. కౌంటర్ నుండి బయటకు వస్తుంటే ఒకతను బయటకు ఎటుగా వెళ్ళాలో దారి చూపించాడు. ఆ దారి గుండా కాన్సులేట్ బయటకు వచ్చాను. ఒక పది నిముషాలకి సంతోష్ దిగులుగా వచ్చాడు, ఏమైంది అని అడిగితే తన వీసా రిజెచ్ట్ అయ్యింది అని చెప్పాడు. ఎందుకు ఏమైంది అని అడిగాను, ఏమో నేను ఒక ప్రష్నకు సరిగా జవాబు చెప్పలేదు అన్నాడు. తన దగ్గర ఒక బ్లూ కలరు పేపర్ ఉంది. అది వీసా ఆఫీసర్ ఇచ్చాడు అని చెప్పాడు, అందులో చూస్తే ఎందుకు రిజెక్ట్ అయ్యిందో ఆ క్లాజు నంబర్ ఉంది.
టీ కొట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న కాయిన్ ఫోన్ నుండి డ్రైవర్ కి ఫోన్ చేసి మేము కారు దగ్గర ఉన్నాము అని చెప్పాను. డ్రైవర్ ఐదు నిముషాల్లో వస్తానన్నాడూ. సంతోష్ కాస్త మూడ్ ఆఫ్ ఐ ఉన్నాడు. నాకు కాFఈ టీ లు అలవాటు లేదు కాని సంతోష్ కి అలవాటు కదా అని రెండూ టీ చెప్పాను. మేము టీ తాగటం అయ్యే లోపు డ్రవర్ వచ్చి కారు డోర్ తెరిఛాడు. లోపల కూఋచున్నాక ముందు గా మొబైల్ ఫోన్ తీసుకొని అమ్మకి నాన్నకి వీస వచ్చింది అని చెప్పాను. ఆ తరువాత చెన్నైలోని మిత్రులకి, హైదరాబాద్లోని మిత్రులకి ఫోన్ చేసాను. మా హెచ్ ఆర్ దెపార్ట్మెంట్ వాళ్ళు ఇంటార్వ్యూ అయ్యక ఎస్ ఎం ఎస్ చెయ్యమన్నారు కాబట్టి వళ్ళకి ఎస్ ఎం ఎస్ చేసాను. తరువాత మొబైలో టైం చూస్తే పది గంటల పదిహేను నిముషాలు అవుతుంది. హ్సంతోష్ ఆఫీస్ లో తన ఇది వరకు పని చేసిన ప్రాజెక్ట్ మేనేజర్ కి ఫోన్ చేసి చెప్పాడు, అతను ఒక్కోసారి ఇలా అవుతుంది నువ్వు వచ్చాక హెచ్ ఆర్ వాళ్ళని కలువు అని చెప్పాడు. హైదరాబాద్ కు మా రెటర్న్ ఫ్లైట్ సాయంత్రం ఆరింటికి. అంత సేఫు ఏం చెయ్యాలి? మేము ముందుగా ఎమి అనుకోలేదు ఇంత త్వరగా అవుతుందని. సంతోష్ మాత్రం అదోలా ఉన్నాడు, తనని ఇప్పుడు ఏమి అడిగేట్టు లేదు. అందుకే ముందు హోటల్ కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యాక మాట్లాడు దామనుకున్నాను. పదకొండూన్నర ఐనా కాలేదు హోటల్ కి చేరుకునే సరికి. ఒక గంటలో ఫ్రెష్ అయ్యాక సంతోష్ రూం కి వెళ్ళాను, తను ఇంటార్నెట్ లో యూ ఎస్ వీసా సైట్లో రెజెక్ట్ కావడనికి కారనం ఉన్న క్లాజు గురించి వెదుకుతున్నాడు. నేను మళ్ళీ నా రూం లోకి వెళ్ళి లాప్ టాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ కి కనేచ్ట్ అయ్యాను, తైవాన్ లో ఉంటున్న మా చెల్లి బావలతో మాట్లాడుదామని. కానీ బావ ఆఫీస్ కి వెళ్ళాడు, చెల్లితోటి , మా చిక్కిరి (మేనల్లుడు కౌశిక్) తో మాట్లాడాను. క్రితం సారి వచ్చినప్పుడు బెసంత్ నగర్ బీచ్ కి వెళ్ళాను, ఈ సారి మెరీనా బీచ్ కి వెళ్ళాలి అనుకున్నాను. రంజిత్ కి ఫోన్ చేసి మెరీనా బీచ్ కి ఎలా వెళ్ళాలి అని అడిగాను, అటు వెళ్ళి వస్తే మొత్తం సమయం దానికె పోతుంది అని అన్నాదు. ఇంకా వేరే ప్రదేషాలు చెబుతుంటే నాకు 'స్నేక్ పార్క్ ' అని వినిపిచి దాని అడ్రెస్ అడిగి తెలుసుకునాను. మరో అరగంటలో రెడీ అయ్యాక సంతోష్, నేను హోటల్ బయటికి వచ్చాము.

No comments: