Wednesday, March 11, 2009

యు. ఎస్. L1 B వీసా ఇంటర్వ్యు - 26th Feb, 2009 - మొదటి భాగం

నాకు గడియారం లో అలారం పెట్టుకునే అలవాటు లేదు. మాములుగానే నేను త్వరగా నిద్ర లేస్తాను. కాని నిన్న రాత్రి హోటల్ రూంలో ఉన్న అలారం గడియారం చూశాను. ఉదయం ఐదున్నరకి అలారం పెట్టాను. కాని ఉదయం ఐదింటికే నిద్ర లేచి అది మ్రోగక ముందే దాన్ని ఆపేసాను. కాసేపు అయ్యాక ప్రక్క గదిలో ఉన్న సంతోష్ కి ఫోన్ చేసాను. ఏడింటికల్లా ఇద్దరం రెడీ అయ్యాము. ఇన్ హౌస్ డైనింగ్ కి ఫోన్ చేసి ఇద్దరికి బ్రేక్ ఫాస్ట్ నా గదిలోకి తీసుకురమ్మన్నాను. ఈ లోపున మేము మా ల్యాప్ టాప్ లో నిన్న రాత్రి రాసుకున్న వివరాలను మరోసారి చూసుకుంటున్నాము. పది నిముషాల్లో రూం కి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని వచ్చాడు. నేను మరో ప్లేట్ (ఇడ్లీ) కుడా తెమ్మని మరో సారి చెప్పాను. ఆ ప్లేట్ లో మూడు ఇడ్లీలు, నాలుగు రకాల చట్నీలు ఉన్నాయి. ఇద్దరం తింటున్నాము, మరో ప్లేట్ అంటే మరో ఖాళీ ప్లేట్ పట్టుకొని వచ్చాడు. అప్పటికే ఆలస్యమౌతుందని మేము బయలుదేరాము. మా ఇంటర్యూ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిముషాలకు ఉన్నది. బయట మా కోసం ఎదురుచూస్తున్న డ్రైవర్ ని అడిగితే హోటల్ నుండి యు ఎస్ కాన్సులేట్ కి వెళ్ళడానికి నలభై నిముషాలు పడుతుందని చెప్పాడు.ఒకశారి ఇంటికి ఫోన్ చేసాను. నిన్న రాత్రి ఎయిర్ పోర్ట్ నుండి వచ్చేటప్పుడు గమనించలేదు కాని ఇప్పుడు చూస్తుంటే రోడ్డుకి రెండు వైపులా భారీ కట్ ఔట్ లు ఉన్నాయి. ఎలెక్షన్ సీజన్ మొదలైంది కదా! వీసా ఇంటర్వ్యూ తతంగం అయ్యేటప్పటికి చాలా సమయం పడుతుందన్నారు మా కొలీగ్స్ అన్నారు. మా ఇంటర్యూ పూర్తయ్యే సరికి ఒంటి గంట అవ్వొచ్చు అనుకున్నాము.
కారు ఒక ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నాక కుడి వైపుకి తిరిగింది. కారు నుండి చూస్తుంటే కొంత మంది జనం ఒక గేటు ముందర బారులు తీరి ఉన్నారు. డ్రైవర్ కారుని ఒక టీ కొట్టు ముందు ఆపేసి కాన్సులేటు గేటు వైపు చూపెట్టాడు. మా మొబైల్ ఫోన్స్ కారులోనే పెట్టి, మా సర్టిఫికేట్స్, వీసాకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ తీసుకున్నాము. మేము బయటికి వచ్చాక తనకి ఫోన్ చేస్తే ఒక ఐదు నిముషాల్లో వస్తాను అని డ్రైవర్ తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. నంబర్ తీసుకొని కాన్సులేట్ గేటు వైపు నడిచాము.
కొంత మంది జనం ఒక దగ్గర గుంపుగా ఉన్నారు, మరో వైపు జనం ఒక క్రమ పద్దతిలో బారులు తీరి ఉన్నారు. గుంపులో ఉన్న ఒకతన్ని అడిగితే వాళ్ళది మధ్యానం ఇంటర్వ్యూ అని అటు వైపు వాళ్ళది ప్రొద్దున అని చెప్పాడు , అతనికి ' థాంక్స్ ' చెప్పి మేము కూడా లైనులో చివరలో నిలుచున్నాము. మా ముందర కనీసం నలభై మంది ఉన్నారు. అప్పటికి సమయం ఎనిమిది గంటల యాభై నుముషాలు. మేము ఎదో మాట్లడుతూ కాసేపు కాలక్షేపం చేస్తున్నాము. ఇంతలో నా కుడి భుజం మీద ఏదో పడినట్టు అనిపించింది. ఏమిటా అని చూస్తుంటే తెలిసింది ' తిండి కొరకు తిరిగి తిరిగి ఆయాస పడుతున్న వాయసంబొకటి నా వస్త్రములను పావనమొనరిచెనని '. నేను వేసుకున్నది క్రీం కలర్ షర్ట్ దాని మీద మరక స్పష్టంగా కనిపిస్తుంది. నా ముందు నిలుచున్న మరొకతని వీపు కూడా పావనమైంది. సంతోష్ తన రుమాలుతో నా కాలర్ మీద ఉన్న మరకను తుడిచే ప్రయత్నం చేసాడు. ఇప్పుడు కాస్త పరవాలేదు. ఇదంతా జరిగేటప్పటికి మాముందు ఇంకా ఇరవై మంది నిలుచున్నారు. సరిగ్గా అప్పుడే ఒక సెక్యూరిటీ అతను వచ్చి ఎవరి చేతుల్లో గ్రీన్ కలర్ కవర్ (ఇది అఫీషియల్ గా కంపెనీ నుండి వీసా కి అప్ప్లై అవుతున్న వాళ్ళు అని గుర్థు అన్నమాట) ఉన్నవాళ్ళాందరిని ముందుకు రమ్మన్నాడు, అలా నేను , సంతోష్ అమాంతంగా ఆ వరుసలో ముందుకు వచ్చేశాము.

2 comments:

ఓ బ్రమ్మీ said...

నాకు తెలిసినంత వరకూ ఈ మధ్య హైదరాబాద్ లో కూడా అమెరికా కాన్స్యులేట్ తెరిచారని, అక్కడ కూడా ఇంటర్వూలు జరుగుతున్నాయి అని. మరి మీరు చెన్నై ఎందుకు వెళ్ళినట్లో!!

MURALI said...

మా కంపెనీ వాళ్ళు కాన్సులేట్ కి దగ్గరగా ఉండే ఒక హోటల్ అరుణాచలా ఇస్తారు.

చక్రవర్తిగారు,
హైదరాబాద్ కాన్సులేట్ ఇంకా పూర్తిస్థాయిలో విధులు చేపట్టలేదు. దశలవారిగా జరుగుతుంది.